Sunday, December 30, 2012

నాలుకతో శ్వాస తీసుకోవచ్చా?

0 comments
సాధారణంగా నాలుకతో రుచి చూడటమే మనకు తెలిసింది. నాలుకతో శ్వాస తీసుకునే జంతువులు కూడా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. తాబేళ్ళలో ఒకరకమైన స్టెర్నో థెరస్ ఓడోరాటస్ అనే తాబేళ్ళు నీటి అడుగుభాగాన ఉన్నప్పుడు నాలుకతో శ్వాస తీసుకుంటున్నాయట.

ఆస్ట్రేలియన్ పైడ్ నెక్ వంటి తాబేళ్ళకు వాటి శరీరం వెనక భాగాన ఒక ప్రత్యేక కుహరం ఉంటుంది. ఇవి నీటి అడుగున ఉంటే, పరిసరాల నుంచి ఆక్సిజన్‌ను ఈ కుహరం గ్రహించడానికి తోడ్పడుతుంది. నాలుక కూడా వాసన చూడటంలో తాబేళ్ళకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

0 comments:

Post a Comment