Tuesday, January 8, 2013

జీరా పులావ్

కావలసినవి
బాస్మతి బియ్యం - కప్పు, నీరు - ఒకటిన్నర కప్పులు, జీలకర్ర - ఒకటిన్నర టీ స్పూను, నెయ్యి - టేబుల్ స్పూను, నూనె -టేబుల్ స్పూను, బిరియానీ ఆకు - 1, ఏలకులు - 4, లవంగాలు - 4, దాల్చిన చెక్క - చిన్న ముక్క, ఉప్పు - రుచికి సరిపడినంత, కొత్తిమీర తరుగు - టీస్పూను, ఉల్లిచక్రాలు - 6

తయారి
బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినంత నీరు పోసి సుమారు ఒక గంటసేపు నాననివ్వాలి. స్టౌ మీద బాణలి ఉంచి అందులో నెయ్యి, నూనె వేసి కాగాక అందులో జీలకర్ర, బిరియానీ ఆకు, ఏలకులు, దాల్చినచెక్క, లవంగాలు వేసి వేగాక, బియ్యం, ఉప్పు వేసి బాగా కలిపి నీరు పోయాలి. మూత పెట్టి, సన్నని సెగ మీద ఉడికించి దింపేయాలి. కొత్తిమీర తురుము, ఉల్లి చక్రాలతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.

వెజిటబుల్ కుర్మా

కావలసినవి:
క్యారట్ - 2, బంగాళదుంపలు - 6 (మీడియం సైజువి), బీన్స్ - 6, పచ్చిబఠాణీ - అర కప్పు, క్యాలీఫ్లవర్ - కొద్దిగా (పువ్వులుగా కట్‌చేసినవి 6), పచ్చికొబ్బరి తుమురు - 150 గ్రా., గసగసాలు - 25 గ్రా., జీడిపప్పు - 25 గ్రా., నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు - 3 (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి తరుగు - మూడు టీస్పూన్లు, టొమాటో తరుగు - పావుకప్పు, కరివేపాకు - రెండు రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను, పసుపు - చిటికెడు, మిరప్పొడి - రెండు టీ స్పూన్లు, ధనియాలపొడి - రెండు టీ స్పూన్లు, జీరా పొడి - టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, ఏలకులు - రెండు, దాల్చినచెక్క - చిన్న ముక్క, లవంగాలు - నాలుగు, కొత్తిమీర - చిన్నకట్ట, గరంమసాలాపొడి - అర టీ స్పూను, గసగసాలు - టీ స్పూను

తయారి:
పచ్చికొబ్బరి తురుము, గసగసాలు, జీడిపప్పులను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. కూరగాయముక్కలను ఉడికించి పక్కన ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి, అందులో ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు, మసాలా దినుసులు కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరాపొడి, మిరప్పొడి, ధనియాలపొడి వేసి కొద్దిగా వేగాక, ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న పచ్చికొబ్బరి మిశ్రమాన్ని వేసి నూనె తేలేవరకు వేయించాలి. తరవాత కొద్దిగా నీరు, టొమాటో ముక్కలు వేసి బాగా కలపాలి. ఆ తరవాత ఉడికించుకున్న కూరముక్కలు, ఉప్పు, గరంమసాలా వేసి గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించి దించేయాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.

0 comments:

Post a Comment